విజ్ఞాన దీపిక - జూలై, 2017 సంచిక

మిత్రమా,
విజ్ఞానదీపిక మాస పత్రికకు మీరందిస్తున్న ఆదరాభిమానాలకు, ప్రోత్సాహానికి మా హృదయపూర్వక ధన్యవాదములు ఇప్పటికే విడుదల అయిన రెండు సంచికలను పదివేల మందికి పైగా ఉపాధ్యాయులు విద్యార్ధులు వీక్షించి చక్కని ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు.
మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న
విఙ్ఞాన దీపిక మాస పత్రిక  మూడవ సంచిక అందుబాటులోకి వచ్చేసింది.
ఇంక మిమ్మల్ని నిరీక్షింపచేయను.
వెంటనే చూసేయండి.


 ఈ సంచికలో ఏవైనా ముద్రణా సంబంధిత, విషయ సంబంధిత దోషాలు ఉంటే మన్నించండి. ఇంకా మాకు తెలియపరచండి. తద్వారా వచ్చే సంచికలను దోషరహితంగా తీర్చిదిద్దేందుకు సహకరిస్తాము.
మీ
అమూల్యమైన సలహాలను సూచనలను అందించగలరు.
మీ
నాగమూర్తి,
ఇగ్నైట్ ఫిజిక్స్
9441786635

మురళి,
సైన్స్ గురు
8008544670

చైతన్య కుమార్ సత్యవాడ,
శాస్త్రచైతన్యం
9441687174

మీ స్పందనలను, సూచనలను, వచ్చే మాసపత్రిక కోసం అందించాలనుకునే వ్యాసాలను మాకు పంపండి
vignanadeepika2@gmail.com
www.vignanadeepika.com

Comments

 1. విజ్ఞాన దీపిక పత్రికా నిర్వాహకులకు శుభాకాంక్షలు. జూలై మాస పత్రిక ముఖచిత్రం బాగుంది. ఈ పత్రికలో నాకు నచ్చిన అంశాలు : ఆవర్ధన విలువకు ప్రతిబింబ లక్షణాలకు మధ్య సంబంధం తెలుపు Don't fear It's clear, దర్పణం ప్రతిబింబ లక్షణం తెల్పే ఫ్లోచార్ట్ చక్కని వివరణను అందించాయి.సి.సి.ఇ ప్రశ్నల నిధి, ప్రశ్నలు మరియు ప్రోజెక్టులు నిత్యజీవిత అనుబంధమై ఉన్నాయి.
  జనాభా గురించిన అంశం విద్యార్థులు తెలుసుకోవలసినది.ఇక సాధారణ అంశాలలో పొడవైన వంతెన బాగుంది. తర్వాత సంచికలో ఇంకా ఆసక్తి గల అంశాలను అందిస్తారని ఆశిస్తున్నాను. మీ గంపా వేంకట రామ ప్రసాద్.

  ReplyDelete
 2. జూలై విజ్ఞానదీపిక పత్రిక అందించిన సంపాదక వర్గానికి ముందుగా ధన్యవాదాలు.
  కవర్ పేజీ బాగుంది. కానీ కవర్ పేజీలో లోపల ఉన్న అంశాలన్నింటినీ వ్రాయనవసరం లేదని నా అభిప్రాయం. పుస్తకం ముఖచిత్రం చూసే పాఠకులకు లోపల ఏముందో అనే ఆసక్తి కలిగించే విధంగా ఉండాలి. మొదటి సారి విడుదలచేసిన పత్రికలోని ముఖచిత్రంలో "విజ్ఞానదీపిక" పదంలో దోషం ఉంది. ఆ దోషం చక్కగా సరిచేసి కవర్ పుటపై వేసారు. మంచి ఫాంట్ ఉపయోగించారు. కానీ లోపల పుటలలో పేజి బ్యాగ్ గ్రౌండ్ లోని "విజ్ఞానదీపిక" అనే పదం సరిగా కనబడటం లేదు ("జ్ఞా" అనే అక్షరం "ఙా" లా కనబడుతుంది). దీనిని సరిచేయాలి. విజ్ఞాదీపిక కు మంచి సుందరమైన లోగోను సృష్టిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక పుస్తకం విషయానికొస్తే భానుచంద్రమూర్తి వ్రాసిన జడవాయువుల కథ ఆశక్తిదాయకంగా ఉంది. దేశంలో పొడవైన వంతెన గూర్చి మంచి విషయాన్ని తెలియజేసారు. కొంత మంది ఉపాధ్యాయులు వికీపీడియా వంటి వాటిలోని ఆర్టికల్స్ యదాతధంగా చేర్చితే ఆయా వ్యాసం క్రింది భాగంలో ఆ సంస్థ యొక్క source ను (source:www.te.wikipedia.org సౌజన్యంతో) అని వ్రాస్తే బాగుంటుంది. వికీపీడియాలో నా వంటి అనేక మంది నిరంతరం స్వలాభాపేక్ష లేకుండా ఉచిత సేవ చేస్తున్నప్పటికీ, ఆయా వ్యాసాలు ఉచితంగా అందిస్తున్నప్పటికీ ఆ సంస్థను గుర్తించే సోర్స్ వ్రాయడంలో తప్పులేదని నా అభిప్రాయం.(ఇది నా వ్యక్తిగత సూచన మాత్రమే)

  బ్రమరాంబ గారి కవిత బాగుంది. ఈ నెల మొక్క గురించి "వరి" గూర్చి ఎన్నో తెలియని విషయాలను అందజేసారు. "పోటీ పరీక్షలలో బయాలజీ" కి సంబంధించిన బహుళైచ్ఛిక ప్రశ్నలు బాగున్నాయి. కానీ వాటి జవాబులు వేరొక పుటలో ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అవి చేయడానికి పాఠకుడు ప్రయత్నించినపుడు అవి వెంటనే కనిపించరాదని నా భావన. నాగమూర్తి గారు వ్రాసిన ఈ నెల ప్రయోగం ఆశక్తిదాయకంగా విద్యార్థి స్వంతంగా చేసేవిధంగా ఉంది. "Don't fear It's clear" వ్యాసం ఎంతో బాగుంది. ఎన్నో తెలియని విషయాలను పటం ద్వారా చక్కగా వివరించిన నాగమూర్తి గారికి ధన్యవాదాలు. పూర్ణిమ గారు వ్రాసిన క్రియేటివ్ ప్రయోగం చాలా బాగుంది. బిట్ బ్యాంకులోని అక్షరాలను లైట్ కలర్స్ వాడటం వల్ల ప్రింట్ తీసినచో సరిగా కనిపించవు. కపిపించే రంగులను వాడాలి. భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన ప్రాజెక్టు ఆలోచనలు అందించిన చైతన్యకుమార్ గారికి ధన్యవాదాలు. "ప్రశ్నల నిధి" బాగుంది. కానీ డి.టి.పి బాగులేదు. ఆటో నెంబరింగ్, జస్టిపై ఆప్షన్స్ ఇవ్వకపోవడం వల్ల ఆకర్షణీయంగా కనబడుటలేదు. ముఖ్యంగా ఫ్లో ఛార్ట్ అధ్బుతంగా ఉంది. దీనిని ఫెక్సీగా చేసి పాఠశాలలో ఉంచితే ఎన్నో విషయాలను విద్యార్థులకు తెలియజేసే వీలుంది. ఫోటీ పరీక్షలలో సైన్స్ శీర్షికలో సమాధానాలను అండర్ లైన్ గా ఇవ్వకపోతే బాగుంటుంది. ఆసక్తి గాల వారు ఈ పుటను ప్రింట్ చేసుకొని సమాధానాలను ప్రయత్నించి వారికి ఎంత జ్ఞానం ఉన్నదో పరీక్షించుకొనేందుకు వీలు లేకుండా ఉంది. విక్రం సారభాయి చిత్రం బాగుంది. ఇది http://www.isro.gov.in/about-isro/dr-vikram-ambalal-sarabhai-1963-1971 సైట్ నుండి తీసినదిగా ఉంది. ఈ పత్రిక ఆన్ లైన్ పత్రిక కనుక కాపీ హక్కుల నియమాలను గుర్తించి చిత్రాలను సేకరిస్తే మంచిదని "వికీపీడియా" నిర్వాహకునిగా నా సూచన.

  మొత్తంమీద పత్రిక యిదివరకటి పత్రికల కంటే ఎంతో బాగుంది. విద్యార్థులకు తక్కువధరకు వచ్చేటట్లు ప్రింట్ చేసి ఇచ్చే విధంగా సంపాదకులు కృషిచేస్తే బాగుంటుంది. ఈ పత్రికలో విశేషమైన వ్యాసాలు వ్రాసిన విజ్ఞానశాస్త్ర అభిమానులందరికీ ధన్యవాదాలు.

  కె.వెంకటరమణ. శ్రీకాకుళం.

  ReplyDelete
 3. విజ్ఞానదీపిక పత్రిక అందించిన సంపాదక వర్గానికి చిన్న విన్నపము. ఒక మాస పత్రికకు దాని పేరు యొక్క ఫాంట్‌ అక్షరాలు మారకూడదు. దాని రంగు, వెనుక ఉన్న డిజైన్సు మార్చవచ్చ. కానీ ఫాంట్‌ మార్చకండి. జూన్ ఫాంట్‌ బాగుంది. అదే తదుపరి పత్రికలకు ఉపయోగించండి. బాగుంటుందని నా అభిప్రాయం మాత్రమే. ధన్యవాదాలు - మీ గంపా వేంకట రామ ప్రసాద్.

  ReplyDelete

Post a Comment

Popular posts from this blog

విఙ్ఞాన దీపిక - మే, 2017 సంచిక

విఙ్ఞాన దీపిక - జూన్, 2017 సంచిక